Author: PAKADI RAMANJANEYULU
కల్వకుర్తి సెప్టెంబర్ 23: కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎల్లికల్ గ్రామానికి చెందిన ఉప్పునుంతల జంగమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతురాలి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మద్దెల వెంకటయ్య, ఆరకంటి పరమేశ్, ఉప్పల బృందం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు ఆడేల అశోక్ తదితరులు పాల్గొన్నారు.
జూరాలకు నీటి విడుదలపై కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీనాగర్ కర్నూల్,సెప్టెంబర్ 23: జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల అంశంపై తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా జూరాలకు దశలవారీగా నీటిని విడుదల చేయాలని మంత్రులు విజ్ఞప్తి చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా నీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి,…
బాలుడు ఆచూకీ కోసం విజ్ఞప్తి వెల్దండ : ఆర్యన్ కుమార్ అనే బాలుడు మంగళవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో తప్పిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు.బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ బాలుడు కొట్ర తండా సమీపంలో తల్లిదండ్రులతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు.బాలుడి తండ్రి పేరు గౌతమ్ సింగ్, తల్లి సావిత్రి దేవి.బాలుడి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.ఆచూకీ తెలిసిన వారు వెంటనే ఈ నంబర్లకు సమాచారం ఇవ్వగలరు: గిరీష్ (బాలుడి సంబంధీకులు):…
ఆమనగల్: ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవచైతన్య కాలనీలోని పలు గణేష్ ఉత్సవ కమిటీలతో పాటు శివసేన యూత్, శ్రీ రామాంజనేయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, సౌభాగ్యం నిండాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు….
మిడ్జిల్, సెప్టెంబర్ 22: మిడ్జిల్ మండల కేంద్రం మీదుగా అక్రమంగా తరలిస్తున్న నాలుగు బొలెరో వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున నాలుగు వాహనాల్లో 22 పాడి ఆవులు, ఎద్దులు, కోడెలను తరలిస్తుండగా కల్వకుర్తికి చెందిన కౌన్సిలర్ వంశీ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 167వ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.
కోడేరు గ్రామంలో ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సర్పంచ్ నడింపల్లి మహేశ్వర్‌రెడ్డి ముందస్తు చర్యలు చేపడుతున్నారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల పరిసరాలు, ఆర్ఎంపీ రోడ్డు పక్క ప్రాంతాలు, ఒడ్డేవాడ కాలనీలోని మోరీలు, డ్రైనేజీలను పరిశీలించి పేరుకుపోయిన మట్టి, చెత్తను జేసీబీ సహాయంతో తొలగిస్తున్నారు. వర్షపు నీరు సజావుగా వెళ్లేలా అవసరమైన ప్రాంతాల్లో శుభ్రత పనులు చేపడుతున్నారు. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరిస్తున్న సర్పంచ్ తీరుపై గ్రామస్థులు…
ఆమనగల్: ప్రకృతి వైపరీత్యాలు, ఎల్ నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం పడిందనే కనీస అవగాహన లేకుండా బీఆర్ఎస్ నాయకులు విద్యుత్ సమస్యపై ధర్నాలు చేయడం హాస్యాస్పదమని ఆమనగల్ మార్కెట్ చైర్పర్సన్ యాట గీతా నరసింహం విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎదుర్కొన్న విద్యుత్ సమస్యలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోకుండా ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆమె ఆరోపించారు. రైతుల సమస్యలను పట్టించుకోని…
వెల్దండ: మండల పరిధిలోని కోట్ర గ్రామానికి చెందిన దుద్దుర్కు ఎల్లయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోట్ర గ్రామ టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ నీరటి రాములు ద్వారా సమాచారం అందడంతో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ స్పందించారు.మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ రూ.3,000 ఆర్థిక సహాయాన్ని ఎల్లయ్య భార్య లక్ష్మికి అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా…
295 రోజులకు చేరిన ఎర్రవల్లి భూ నిర్వాసితుల దీక్షలుమహా పాదయాత్రకు మద్దతుగా భారీగా తరలివస్తాం: భూ నిర్వాసితులుఎర్రవల్లి భూ నిర్వాసితుల ఆందోళన 295వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో దీక్షా స్థలంలో సంఘీభావ కార్యక్రమం నిర్వహించారు.ఈ నెల 27న ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు చేపట్టనున్న మహా పాదయాత్రకు సంబంధించి దీక్షా స్థలంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి భూ నిర్వాసితులు మాట్లాడుతూ…..
శుభకార్యాల్లో సన్నాయి మేళం శాస్త్రీయ లాభాలు ఏంటో తెలుసుకుందాంనాగర్ కర్నూల్:శుభకార్యాల్లో సన్నాయి–డోలు మేళాన్ని మంగళ వాయిద్యంగా పిలుస్తారు. సన్నాయి నాదం శుభం, ఆనందానికి ప్రతీకగా భావిస్తూ, దేవతా అనుగ్రహం లభిస్తుందనే ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. పూర్వకాలంలో మైకులు లేని సమయంలో శుభకార్యం జరుగుతోందని గ్రామ ప్రజలకు తెలియజేయడానికి కూడా సన్నాయి నాదాన్ని ఉపయోగించేవారు. దీని గంభీరమైన ధ్వని వేడుకకు ఉత్సాహం, పండుగ వాతావరణాన్ని తీసుకువస్తుంది. అందుకే సన్నాయి మన సంప్రదాయంలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.