Author: PAKADI RAMANJANEYULU
జూపల్లి: చారగొండ మండలంలోని జూపల్లి గ్రామంలో భగత్ సింగ్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ యువజన సంఘం సభ్యులు మాట్లాడుతూ.. భగత్ ఆశయాలను కొనసాగించడమే మనం వారికి ఇచ్చే అసలైన నివాళులని అన్నారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘం సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున…
నాగర్ కర్నూల్ : మహబూబ్‌నగర్ జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జై ప్రకాశ్ నారాయణ్ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ కేఎస్ రవికుమార్‌ను ప్రముఖ వ్యాపారవేత్త,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా రవికుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.తన ఎన్నిక సందర్భంగా జూపల్లి భాస్కర్‌రావు అందించిన సహకారానికి కేఎస్ రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. తన ఆధ్వర్యంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి…
నాగర్ కర్నూల్ : పితృవియోగంతో బాధలో ఉన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని ఆదివారం కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శించారు.కొల్లాపూర్ నియోజకవర్గం, సింగోటంలోని బీరం హర్షవర్ధన్ రెడ్డి ఇంటికి వెళ్లి వారి తండ్రి దివంగత బీరం లక్ష్మారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన వెంట పలువురు కల్వకుర్తి పట్టణ నాయకులు,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
నాగర్ కర్నూల్ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని సెప్టెంబర్ 28న సోమవారం ఉదయం 9:00 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించ బడుతుందని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి తెలిపారు.ఈ ధర్నా కార్యక్రమం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు,అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు,పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి…
నాగర్ కర్నూల్ : కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తండ్రి, సుపరిచితులైన బీరం లక్ష్మారెడ్డి ఇటీవల మరణించిన నేపథ్యంలో ఆయన దశదినకర్మ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు.లక్ష్మారెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి,ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్,సి. లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, విజయుడు,ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు…
కల్వకుర్తి సెప్టెంబర్ : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి అక్రమంగా 30 టీఎంసీల నీటిని తరలించి పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చే కుట్రను వ్యతిరేకిస్తూ, ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.ఉల్పర నుంచి కల్వకుర్తి వరకు చేపట్టిన ఈ పాదయాత్రలో బీజేపీ నేత, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి…
చారగొండ సెప్టెంబర్ 27: చారగొండ మండలంలోని జూపల్లి గ్రామంలో గ్యార్మి వేడుకలను ముస్లిం యువకులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఖాదీర్ ముస్లింలు పాటించాలని పలువురు ముస్లిం మత పెద్దలు కోరారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాప ప్రక్షాళన గ్యారి షరీఫ్ ఉద్దేశమని ఆర్థిక లాభాలు వ్యక్తిగత స్వార్థాలతో ఆందోళన చెందుతున్న ఆధునిక సమాజంలో ఆధ్యాత్మిక చింతన పండుగ ప్రబోధిస్తుందని అన్నారు….
కల్వకుర్తి సెప్టెంబర్ 27: కల్వకుర్తి మండలంలోని గుండూరు గ్రామంలో అసంపూర్తిగా ఉన్న 03 ఇండ్ల నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్టు ద్వారా రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ సహకారంతో మూడు ఇండ్లు సంపంగి శివ,ఆఫీసు శ్రీను, గోరేటి చిన్న చెన్నయ్యలకు సిమెంటును అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, బిఆర్ఎస్ నాయకులు…
నాగర్ కర్నూల్: విద్యార్థుల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, వారి సృజనాత్మకతను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ టాస్క్ కార్యాలయంలో మొబైల్ ఫిల్మ్ మేకింగ్ మరియు సినిమాటోగ్రఫీ వర్క్‌షాప్‌ను నిర్వహించామని టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. కళాశాలలకు చెందిన 56 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఈ వర్క్‌షాప్‌లో మొబైల్ ఫిల్మ్‌మేకింగ్,ఫోటోగ్రఫీ ప్రాథమిక అంశాలు, కెమెరా టెక్నిక్స్, ఫ్రేమింగ్, లైటింగ్,విజువల్ స్టోరీటెల్లింగ్, ప్రాథమిక సినిమాటోగ్రఫీ తదితర అంశాలపై విద్యార్థులకు ప్రాక్టికల్ శిక్షణ అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుత…
ఆమనగల్లు: కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఎంపీ మల్లు రవి,ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆమనగల్లు వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ అన్నారు.ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమనగల్ లో అదనపు సివిల్ కోర్టు మంజూరు చేయడం హర్షణీయమని,దూర ప్రాంతాలకు వెళ్లే స్థానిక ప్రజలకు దూరం తగ్గి ఆమనగల్లు లో వ్యాపారాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. సుమారు వారం రోజుల క్రితం అభివృద్ధి పనుల కోసం రెండు కోట్ల నిధులు…