రిపోర్టర్, సంగారెడ్డి | 9000600737
Latest posts by MOHAMMAD MOHAMMAD
(see all) జహీరాబాద్: ఝరాసంగం మండలం చిల్లపల్లి గ్రామానికి చెందిన బి. రాములుకు చెందిన ఆటో బుధవారం జహీరాబాద్ పట్టణంలోని పస్తాపూర్ సమీపంలో చోరీకి గురైంది. ఎస్వీ ఫంక్షన్ హాల్ సమీపంలో తన ఆటోను నిలిపి ఉంచి వివాహ శుభకార్యానికి వెళ్లిన రాములు, సుమారు గంట తర్వాత తిరిగి వచ్చి చూడగా ఆటో కనిపించలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు.
వెంటనే పస్తాపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆటో చోరీపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫంక్షన్ హాల్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి తన ఆటోను గుర్తించి త్వరగా తిరిగి అందించాలని బాధితుడు బి. రాములు పోలీసులను కోరుతున్నారు.