దిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురిపై కేసు
- వడ్ల దొంగల ముఠా అరెస్ట్ - November 25, 2026
- హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత - November 25, 2026
- దిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురిపై కేసు - November 25, 2026

జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్: దేశ రాజధాని దిల్లీలో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. ప్రీత్ విహార్ ప్రాంతంలోని ఓ కేఫ్‌లో 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేఫ్ మూసివేసిన అనంతరం లోపలికి వెళ్లిన ఎనిమిది మంది మద్యం సేవించినట్లు సమాచారం. ఈ క్రమంలో యువతిపై ఇద్దరు సహోద్యోగులు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తూ, మిగిలిన అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహిళల భద్రతకు సంబంధించిన అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
