అక్రమ ఆహార తయారీ కేంద్రాలపై ఎస్‌ఓటీ దాడులు

మేడ్చల్: ప్రజారోగ్యానికి హాని కలిగించే అక్రమ ఆహార తయారీ కేంద్రాలపై మల్కాజిగిరి ఎస్‌ఓటీ జోన్‌-1 బృందం కొరడా ఝళిపించింది. కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రెండు యూనిట్లపై దాడులు నిర్వహించింది. శ్రీ కర్ణి మాత నమ్కీన్ ఫుడ్ చిప్స్ యూనిట్‌లో అపరిశుభ్ర వాతావరణంలో, తయారీ, గడువు తేదీల వివరాలు లేకుండా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించింది. వసంత్‌నాథ్ ఎంటర్‌ప్రైజెస్‌లో అనుమతులు లేకుండా కోళ్ల, చేపల మేత తయారీతో పాటు కాలం చెల్లిన ఆహార పదార్థాల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. రెండు కేంద్రాల నుంచి సుమారు 4,000 కిలోల కాలం చెల్లిన ఆహార పదార్థాలు, ముడిసరుకుతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు, స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కీసర పోలీసులకు అప్పగించారు.

You may also like...