ముదిరాజ్ల ఐక్యతకు పిలుపు.. మహాసభ వార్షికోత్సవ గోడపత్రిక విడుదల
- ఆహార శుద్ధి కర్మాగారానికి భూమిపూజ.. ముఖ్యఅతిథిగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి - November 20, 2026
- పలు శుభకార్యాలలో పాల్గొన్న ప్రముఖ సంఘ సేవకులు పాపిశెట్టి రామన్న - November 20, 2026
- నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా.. వెల్దండలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం ప్రారంభం - November 20, 2026

వెల్దండ,నవంబర్ 20:తెలంగాణ ముదిరాజ్ మహాసభ 12వ వార్షికోత్సవం, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 21న నిర్వహించనున్న వేడుకల గోడపత్రికను శుక్రవారం వెల్దండలో విడుదల చేశారు.వెల్దండ ముదిరాజ్ సంఘం వద్ద జిల్లా మత్స్యకార సొసైటీ డైరెక్టర్ క్యాసరపు వెంకటయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు బాదేపల్లి మల్లయ్య ముదిరాజ్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 21న జరిగే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని, ముదిరాజ్లంతా ఐక్యంగా పాల్గొని సంఘటిత శక్తిని చాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు బస్నమోని లింగం ముదిరాజ్,కృష్ణ ముదిరాజ్, గ్రామ అధ్యక్షుడు, ఉపసర్పంచ్ బస్నమోని శ్రీనివాస్ ముదిరాజ్, బయ్య మల్లయ్య ముదిరాజ్, మాసుల బాలరాజు, మండల యూత్ అధ్యక్షుడు బొక్కల శ్రీనివాస్ ముదిరాజ్, పిల్లి దేవేందర్ ముదిరాజ్, మారేపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, బొక్కల శేఖర్,రంగరాతి శ్రీశైలం, మోర శ్రీను,గంటల రామకృష్ణ, కోనేరు శ్రీను,బస్నమోని శ్రీకాంత్, మావిళ్ల వెంకటయ్య,సదమోని దశరథం,యువకులు, మత్స్యకార సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
