మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కల్వకుర్తి నాయకుల భేటీ.!
- వ్యవసాయ బోర్ల కేబుల్ వైర్ల చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్.! - November 19, 2026
- ఎరవెల్లి ప్రజల పాదయాత్రకు చీమర్ల అర్జున్ రెడ్డి సంపూర్ణ మద్దతు.! - November 19, 2026
- జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు.. పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి - November 19, 2026

కల్వకుర్తి, నవంబర్ 19(తెలంగాణ గర్జన): మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మాడుగుల, వెల్దండ మండలాల బీసీ, ఎస్సీ సంఘాల నాయకులు, పలువురు సర్పంచులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు.ఈ సమావేశంలో సింగం నాగేష్ గౌడ్, పాలకూర రాజు గౌడ్, సిద్ధగొని రమేష్ గౌడ్, డొంకి శ్రీను, నాగిళ్ల మహేష్, చింతపల్లి బాలరాజ్ గౌడ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
