కబడ్డీలో కింగ్‌లు.. ఖోఖోలో రన్నరప్‌లు.. తెలకపల్లి గురుకుల విద్యార్థుల విజయదుందుభి!
- కబడ్డీలో కింగ్‌లు.. ఖోఖోలో రన్నరప్‌లు.. తెలకపల్లి గురుకుల విద్యార్థుల విజయదుందుభి! - November 15, 2026
- మహిళలకు దక్కని గౌరవం! పెన్షన్ పత్రాల పంపిణీలో కుర్చీల కొరత.. నేలపైనే మహిళల నిరీక్షణ! - November 14, 2026
- పింఛన్ లబ్ధిదారుల ఇంట వెలుగులు.. అర్హులందరికీ ప్రభుత్వ భరోసా: ఎమ్మెల్యే కసిరెడ్డి.! - November 14, 2026

నాగర్‌కర్నూల్ నవంబర్ 14 :ఉమ్మడి పాలమూరు జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో తెలకపల్లి మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయకేతనం ఎగురవేశారు.వనపర్తి జిల్లా చిట్యాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో తెలకపల్లి గురుకుల విద్యార్థులు కబడ్డీ విభాగంలో ప్రథమ స్థానం సాధించి విజేతలుగా నిలిచారు. అదేవిధంగా ఖోఖో పోటీల్లో ద్వితీయ స్థానం కైవసం చేసుకుని రన్నరప్‌గా నిలిచారు.రెండు క్రీడా విభాగాల్లోనూ ప్రతిభ చాటి పాఠశాలకు మంచి పేరు తీసుకురావడంతో విద్యార్థుల విజయంపై ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ చంద్రశేఖర్, పీఈటీ మల్లేష్ విజేత విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
