భక్తుల సౌకర్యం కోసం బోరు ఏర్పాటు.. నీటి కష్టాలకు చెక్ పెట్టిన సర్పంచ్ శారద చెన్నయ్య!

1001375445.jpg

వెల్దండ,నవంబర్ 19: కొట్ర గ్రామంలోని శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు నీటి ఇబ్బందులు కలగకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ శారద చెన్నయ్య ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆలయ పరిసరాల్లో నీటి వసతి లేకపోవడంతో భక్తుల సౌకర్యార్థం కొత్తగా బోరు వేయించారు.భగవంతుని కృపతో బోరులో సమృద్ధిగా నీరు పడటంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.భక్తుల అవసరాన్ని గుర్తించి నీటి వసతి కల్పించిన సర్పంచ్ శారద చెన్నయ్యను గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను 'అపర భగీరథురాలు' అంటూ ప్రశంసిస్తున్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శాంపూరి సత్యం, కొప్పు మల్లేష్, సాయి యాదవ్, హన్మంత్, అలివేలు, కాంగ్రెస్ నాయకులు వసంతపు రాజు యాదవ్, తిరుపతయ్య, మొగులాల్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...