పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం – సర్పంచ్ ప్రసాద్ గౌడ్

1001374644.jpg

వెల్దండ నవంబర్ 18 :వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ల పత్రాలను గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్, ఉపసర్పంచ్ రామకృష్ణ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేయూత పెన్షన్లతో పాటు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చల్లా వెంకట్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, బ్రహ్మచారి, వార్డు సభ్యులు ధన్సింగ్ నాయక్, పోలే అంజయ్య, అల్లె నరేష్, నేనావత్ ధన్సింగ్, శిరీష తదితరులు పాల్గొన్నారు.

You may also like...