TSUTF- MJP Wing రాష్ట్ర అధ్యక్షులు లివింగ్స్టన్

బి.సి. గురుకుల ఉద్యోగుల పెండింగ్ డీఏ బకాయిలు విడుదల చేయాలి – పీఆర్సీ వెంటనే ప్రకటించాలి…
గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా TSUTF నిరంతరం కృషి చేస్తుందని TSUTF–MJP WING రాష్ట్ర అధ్యక్షుడు జి. లివింగ్స్టన్ పేర్కొన్నారు. TSUTF–MJP WING రాష్ట్రస్థాయి మెంబర్షిప్ నమోదు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి బాలికల MJP గురుకుల పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయ బృందం నాయకులకు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో అమలవుతున్న టైమ్‌టేబుల్‌ను ఉపాధ్యాయులు, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. నూతనంగా నియామకమైన ఉద్యోగుల సర్వీసును వెంటనే రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నూతన పీఆర్సీని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలని, గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
ఉపాధ్యాయ, ఉద్యోగుల హక్కుల సాధన కోసం సంఘటిత పోరాటం అవసరమని, ప్రతి ఉద్యోగి TSUTFలో భాగస్వామి కావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం TSUTF నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాధవిగారు TSUTF కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఆకుల బాబు , రాష్ట్ర కార్యదర్శి జి. వెంకటనారాయణ, మురళి,కృష్ణయ్య,
రూప్ సింగ్, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు.

Dubbaka Srinivas

My name is DUBBAKA SRINIVAS, Education:(B.A), GRADUATED, I have multiple skills but I'm interested journalism My was facing the more than problems in society but I stand with GENUINE & TRUE peoples and society I will try to Justies, I will show the truth to society.

You may also like...