రిపోర్టర్, కామారెడ్డి | 919959606808
Latest posts by Dubbaka Srinivas
(see all) కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి చౌరస్తా వద్ద గల రైతు వేదికలో బుధవారం నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మొత్తం 207 మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నర్సింగ్ రావు, గ్రామ సర్పంచ్ రావుల ప్రభాకర్ వినోద, మండల అధ్యక్షులు నౌసిలాల్, సర్పంచులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.