ప్రతి మహిళ దుర్గాదేవిలా హిందూ సంస్కృతిని, దేశాన్ని రక్షించాలి
- నీళ్లున్నా రైతులకు కరువేనా? రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంపై ప్రవీణ్ కుమార్ ధ్వజం! - October 22, 2026
- బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ! - October 22, 2026
- అలంపూర్లో ఘనంగా స్వేరోస్ డే - October 22, 2026

- శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు నరేష్ కుమార్ పిలుపు
- నిమజ్జనం సందర్భంగా భక్తులకు పులిహోర ప్రసాదం పంపిణీ
- మహిళా శక్తి, ధైర్యసాహసాలు సమాజానికి ఆదర్శం
- సనాతన ధర్మం, సంప్రదాయాలను కాపాడుకోవాలి
- సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమం
జ్ఞానతెలంగాణ,వెబ్ డెస్క్,శంకర్పల్లి : ప్రతి మహిళ దుర్గాదేవిలా ధైర్యసాహసాలతో హిందూ సంస్కృతిని, దేశాన్ని రక్షించాలని శంకర్పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు, బీజేపీ ఎండోమెంట్ సెల్ ధార్మిక విభాగం రంగారెడ్డి జిల్లా రూరల్ జాయింట్ కన్వీనర్ ఆర్. నరేష్ కుమార్ (సతీష్ కుమార్) పిలుపునిచ్చారు. దేవీ నవరాత్రుల ముగింపు సందర్భంగా బుధవారం నిర్వహించిన అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ, దుష్టశక్తులను సంహరించి ధర్మాన్ని కాపాడిన దుర్గాదేవి స్ఫూర్తితో మహిళలు అన్యాయాన్ని ఎదిరించి సమాజంలో ధైర్యంగా ముందుకు సాగాలని అన్నారు. మహిళలను తక్కువగా చూడటం, వారిపై హింసకు పాల్పడటం వంటి ధోరణులను విడనాడాలని సూచించారు. దేశ రక్షణలో మహిళలు చూపుతున్న సాహసం, ధైర్యాన్ని ఆయన ప్రస్తావిస్తూ, సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేవీ నవరాత్రులు ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయ ఆలోచనల ప్రాధాన్యాన్ని కూడా గుర్తుచేస్తాయని పేర్కొన్నారు. ఇటువంటి పండుగలను అందరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ సభ్యులు మురళీకృష్ణ, వెంకటేష్, మధు, ఆంజనేయులు, విజయానంద్, పండరినాథ్, వడ్డే వెంకటేష్, బీజేపీ ఎండోమెంట్ సెల్ ధార్మిక విభాగం నవాబుపేట మండల కో-కన్వీనర్ కేదారి ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.
