బతుకమ్మ వేడుకల్లో దాడి .. బాధితులకు అండగా మందకృష్ణ మాదిగ!

జ్ఞాన తెలంగాణ, వెబ్ డెస్క్, చేవెళ్ల ప్రతినిది : పండుగ వేళ డప్పు చప్పుళ్ల మధ్య చెలరేగిన వివాదం దాడి కి దారితీయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చేవెళ్ల మండలం రేగడి ఘనపూర్‌లో బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా డప్పు కొడుతున్న భాస్కర్‌పై రాఘవ, వీరారెడ్డి వారి అనుచరులు దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్థులు న్యాయం కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మ శ్రీ మందకృష్ణ మాదిగను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. గ్రామస్థుల నుంచి ఘటన వివరాలు తెలుసుకున్న మందకృష్ణ మాదిగ, చేవెళ్ల పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ కోటేశ్వరరావుతో ఫోన్‌లో మాట్లాడి విషయం వివరించినట్లు సమాచారం. వాస్తవాలను వెలికితీసిచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

You may also like...