పండగల సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న పీఏసీఎస్‌ చైర్మన్‌ బొల్లారం వెంకట్‌రెడ్డి


జ్ఞానతెలంగాణ వెబ్ డెస్క్,శంకర్‌పల్లి: పొద్దుటూరు గ్రామంలో పండగల సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ బొల్లారం వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్‌ బండ లక్ష్మీ నరసింహ, ఉపసర్పంచ్‌ కావేలి గోవర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ కటిక శ్రీనివాస్‌, వార్డు సభ్యులు ఏనుగు నరేందర్‌రెడ్డి, కోటి ప్రశాంత్‌, ఉమ్మెత్తల శ్వేత, వినోద్‌కుమార్‌, నట్టల అనిత, రమేష్‌, కావేలి తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. గ్రామ పెద్దలు కావేలి జంగారెడ్డి, పులకండ్ల రఘుపతిరెడ్డి, గ్రామ యువకులు, ముదిరాజ్‌ సంఘం సభ్యులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అందరి భాగస్వామ్యంతో జయంతి వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

You may also like...