పితృదేవో భవ.. ఆచార్యదేవో భవ’ – ఒకే వేదికపై గురు, పితృమూర్తుల ఆనంద బాష్పాలు!

​ప్రముఖ కరాటే మాస్టర్ అనిల్ కుమార్ నిర్వహించిన కరాటే కాంపిటీషన్ పోటీలలో విజయలుగా నిలిచిన వారికి బహుమతులు సర్టిఫికెట్స్ అందజేయడానికి సభ కార్యక్రమాన్ని శంకర్ పల్లి మనీ గార్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సుమన్ విచ్చేశారు అలాగే కరాటే మాస్టర్ తల్లిదండ్రులు, విద్యా బుద్ధులు చెప్పిన గురువులు, హాజరై ఈ విధంగా మాట్లాడాను

ఒక బిడ్డ సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు అందరికంటే ఎక్కువగా మురిసిపోయేది ఇద్దరే వ్యక్తులు.. ఒకరు జన్మనిచ్చిన తండ్రి, మరొకరు జీవితాన్ని దిద్దితీర్చిన గురువు. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో అటువంటి అరుదైన, కంటికింపుగా అనిపించే దృశ్యం సాక్షాత్కరించింది.

​తమ కళ్ళ ముందే ఎదిగి, సమాజంలో ఉన్నత స్థానంలో నిలిచిన అనిల్ మాస్టర్ గురించి జన్మనిచ్చిన తండ్రి గర్వంగా మాట్లాడుతుంటే.. అదే వేదికపై ఉన్న గురువు తన శిష్యుడి విజయాన్ని చూసి మురిసిపోయారు. 'నా కొడుకు సాధించిన విజయం నా జన్మను ధన్యం చేసింది' అని తండ్రి, 'సమాజానికి ఒక ఉత్తమ పౌరుడిని అందించానన్న తృప్తి నాకు దక్కింది' అని గురువు ఆనందం వ్యక్తం చేశారు. మార్గదర్శకులుగా నిలిచి నడిపించిన ఆ ఇద్దరి మూర్తుల ఆశీస్సుల నడుమ ఆ వేదిక అనుబంధాల నిలయంగా మారింది. ఈ దృశ్యం చూసిన వారందరినీ మంత్రముగ్ధులను చేసింది.

You may also like...