రిపోర్టర్, రంగారెడ్డి | 919963721717
Latest posts by Sudhakar B
(see all) చండూరులో వైభవంగా అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చండూరు, నవంబర్ 17:
చండూరు పట్టణంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయంగా అయ్యప్ప మాల ధరించిన ఎమ్మెల్యే, ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, ప్రతిష్ఠాపన క్రతువుల్లో భక్తితో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సౌజన్య తదితర ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వాములు, భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం శరణు ఘోషతో మారుమోగింది.
