బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన నాయకులు

1001239803.jpg

వెల్దండ: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త షరీఫ్‌ కుటుంబాన్ని పార్టీ నాయకులు పరామర్శించి, వారి కుటుంబానికి రూ.15 వేల ఆర్థిక సాయం అందజేశారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఈ సాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సిద్ధగోని రమేష్‌గౌడ్‌, ఉప సర్పంచ్‌ గణేష్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ వెంకటయ్య, మాజీ ఉప సర్పంచ్‌ కరుణాకర్‌రెడ్డి, మాజీ రైతు అధ్యక్షుడు కొప్పుల రవి, గ్రామ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు గోరంట్ల వెంకటయ్య, ఉపాధ్యక్షుడు ఆడివయ్య, ప్రధాన కార్యదర్శి కాలే మల్లేష్‌, వార్డు సభ్యులు కాలే తిరుపతి, నల్లపల్లి వెంకటయ్య, కురుపూరి శేఖర్‌, గోరంట్ల రమేష్‌, కలకొండ బుచ్చయ్య, గోరేటి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.అలాగే బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సిద్ధగోని పరమేష్‌, కేశమాని రాములు, కొప్పు కృష్ణయ్య, శంకర్‌, మహేష్‌, పెద్దయ్య, అంజయ్య, మొగులయ్య, తిరుపతయ్య, నరసింహ, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

You may also like...