పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్
- పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు అరెస్ట్ - October 5, 2026
- ఈసీని తొలగించాలని సిపిఎం, సిపిఐ పార్టీలు ధర్నాకు పిలుపు - October 5, 2026
- కొట్ర గ్రామంలో కరెంటు కటకటాలు.. ప్రజావాణిలో సర్పంచ్ ఫిర్యాదు - October 5, 2026
కల్వకుర్తి: కల్వకుర్తి మండలం పరిసర ప్రాంతాల్లో పశువుల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు, వారి నుంచి రూ.లక్ష నగదు, టాటా ఏస్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు స్థానిక ఎస్సై కురుమూర్తి తెలిపారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు సంచరిస్తున్నట్లు గుర్తించినా, పశువుల దొంగతనాలకు సంబంధించిన సమాచారం తెలిసినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలను కోరారు.
