జర్నలిస్టుల హక్కుల కోసం గళమెత్తిన మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్న మీడియా ప్రతినిధులు

1000202891.jpg

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ TUWJ (IJU) ఆధ్వర్యంలో జనగామలో మీడియా ప్రతినిధులు నిరసన చేపట్టారు. పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపిన అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. నూతన మీడియా కమిషన్ ఏర్పాటు చేయడంతో పాటు జర్నలిస్టులకు రక్షణ చట్టం, హెల్త్ బోర్డు, ఇళ్ల స్థలాలు, క్యాష్‌లెస్ కార్డులు, హెల్త్ కార్డులు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురగెల జిక్షవతి, కోశాధికారి సంతోష్‌తో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

You may also like...