గాంధీ జయంతి వేడుకలకు హాజరైన మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి శ్రీ కడకంచి బాలమణి శ్రీనివాస్

జనగామ పట్టణంలోని గాంధీ చౌరస్తా, జిల్లా గ్రంథాలయ శాఖ కార్యాలయం, జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాలకు మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కడకంచి బాలమణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ చూపిన అహింస, సత్యాగ్రహం, స్వచ్ఛత మార్గాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛమైన జనగామ నిర్మాణానికి ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
