డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి సాయి చైతన్య
- ఎయిడ్స్‌పై అవగాహనకు భారీ ర్యాలీ - August 12, 2026
- కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై హైకోర్టు మధ్యంతర స్టే - August 12, 2026
- మిల్లర్ల బకాయిలు వసూలు చేయాల్సిందే - August 12, 2026

- డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాలి
- కోటగిరిలో సమీక్షా సమావేశంలో పాల్గొన్న సిపి సాయి చైతన్య
- పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలిస్తున్న దృశ్యం
జ్ఞాన తెలంగాణ,నిజామాబాద్, కోటగిరి:
కోటగిరి పోలీస్ స్టేషన్ లో బుధవారం బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిర్వహించారు , ఈ సందర్భంగా ఉదయం నుండి సాయంత్రం వరకు డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు, డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు, పాత నేరస్థులపై నిఘా , చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై అవసరమైతే పి.డీ యాక్టు నమోదు చేయాలని పోలీస్ అధికారులకు సిపి ఆదేశించారు, రాబోయే పండగలు నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు, డయల్ 112 గురించి ముమ్మరంగా ప్రచారం చేయాలని పేర్కొన్నారు, డివిజన్ పరిధిలో నమోదైన సైబర్ మోసాలు, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా వంటి కేసులపై ప్రత్యేకంగా చర్చించారు, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, షీ టీమ్స్, చీత ఫోర్స్ వంటి ప్రత్యేక బృందాలు సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు, ఈ సమావేశంలో బోధన్ ఏసీపి పి .శ్రీనివాస్, సి.సి.ఆర్.బి. ఏసీపి గురు నాయుడు, సి.సి.ఆర్బి ఇన్స్పెక్టర్ ఆర్ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు
