ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి
- రోడ్డు ప్రమాద బాధితుడికి గోలి సాయం - August 12, 2026
- ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి - August 12, 2026
- డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి సాయి చైతన్య - August 12, 2026

- ఎల్ఆర్ఎస్ అమలుపై శంషాబాద్ జోన్‌లో సమీక్ష సమావేశంలో
- జోనల్ కమిషనర్ కే చంద్రకళ
జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, ఆగస్ట్ 12:
శంషాబాద్, జీహెచ్‌ఎంసీ
శంషాబాద్ జోన్ జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్ కుమారి కె. చంద్రకళ ఆధ్వర్యంలో,బుధవారం ఎల్‌ఆర్‌ఎస్ (ల్యాండ్ రెగ్యులరీ్సేషన్ స్కీం ) అమలు, ఫీజు వసూళ్ల వేగవంతం, అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ప్రొసీడింగ్స్ జారీపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
శంషాబాద్ జోన్ పరిధిలోని ఆదిబట్ల సర్కిల్–15, బడంగ్‌పేట్ సర్కిల్–16, జల్‌పల్లి సర్కిల్–17, శంషాబాద్ సర్కిల్–18,కు చెందిన వార్డు అధికారులతో సమావేశం నిర్వహించి, ఆయా సర్కిళ్లలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులు, పెండింగ్ దరఖాస్తులు, ఫీజు చెల్లింపులు, ప్రొసీడింగ్స్ జారీ ప్రక్రియపై జోనల్ కమిషనర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ కె. చంద్రకళ మాట్లాడుతూ, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హత కలిగిన దరఖాస్తుదారుల నుంచి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లింపులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను,ఆదేశించారు.అదేవిధంగా, ఫీజు చెల్లించిన అర్హత కలిగిన,దరఖాస్తుదారులకుప్రొసీడింగ్స్‌ను ఎలాంటి జాప్యం లేకుండా జారీ చేయాలనిమొత్తం ప్రక్రియను సమర్థవంతంగా, పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.ప్రతి వార్డులో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ కేసులను వార్డు వారీగా సమీక్షిస్తూ నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియపై స్పష్టమైన సమాచారం అందిస్తూ, వారి సందేహాలు, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు.ఈ సమావేశంలో చీఫ్ సిటీ ప్లానర్ శ్రీ కె.ఎన్. మెహ్రా*శంషాబాద్ జోన్‌కు చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్లు టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

