ఉచిత చేప పిల్లల పంపిణీ ప్రతి ఏడాది లేటెనా…?
- రోడ్డు ప్రమాద బాధితుడికి గోలి సాయం - August 12, 2026
- ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి - August 12, 2026
- డివిజన్ పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సిపి సాయి చైతన్య - August 12, 2026

- ఆకలి సళ్లారిన తరువాత అన్నం ఎందుకు చెరువుల్లో నీళ్ళు తగ్గిన తర్వాత చేప పిల్లలేందుకు..?
- మత్స్యకారులను ప్రభుత్వం మర్చినట్లేనా…?
- మత్స్యకారుల ఉపాధి పై పొట్ట కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం,
- ముదిరాజ్ యువసేన తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ఇంచార్జ్ సత్యం ముదిరాజ్
జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, ఆగస్టు 12:
రంగారెడ్డి జిల్లా లో మెత్తం 1100 చేరువు కుంటలండగా213 సంఘాలు ఉండగా అందులో 10 వేలకు పైగా గుర్తింపు పొందిన సభ్యులు ఉన్నారు
షాద్ నగర్ నియోజకవర్గం 220 చెరువుకుంటాలుంటే గత సం 60 చెరువులలో మాత్రమే చేపపిల్లలను పంపిణీ చేశారు 2024-25 సంలో 400 చెరువుకంటలకు 59 లక్షల చేప పిల్లలు పంపిణీ చేశారు ఇక్కడ తెలుస్తుంది ఎన్ని కుంటలుంటే ఎన్ని చేప పిల్లలు ఇచ్చారు మరియు కుంటలకు సరిపడా చేప పిల్లలు ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు ఈ సంవత్సరం వర్షాకాలం పూర్తి కావస్తున్న ఇప్పటిదాకా చేప పిల్ల పంపిణీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలని మబ్బ పెట్టి పాలన చేస్తున్న ప్రభుత్వం అని అందరికీ అర్థమైంది వచ్చే ఎన్నికల్లో గద్దె దించేలా ముదిరాజుల కీలకపాత్ర ఉంటుందని హెచ్చరించారు వర్షాకాలం పూర్తికావస్తున్న ఇప్పటివరకు మత్స్యశాఖకు మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ చేయకపోవడం సిగ్గుచేటూ అని మండిపడ్డారు కాంట్రాక్టర్ నేటికీ సప్లై చేయకపోవడం ఏమిటని ముదిరాజ్ యువసేన తెలంగాణ రాష్ట్రం సోషల్ మీడియా సత్యం ముదిరాజ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ముదిరాజ్ యువసేన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఉచిత చేప పిల్లల కొనుగోలు గ్రామ సొసైటీలోకి ఇచ్చి ఆ డబ్బులు నేరుగా వారి ఖాతాలో జమ చేయవలసిందిగా మత్స్యశాఖ అధికారులు పెడచెవిన పెట్టారని మండిపడ్డారు చెరువుల,డ్యామ్ల,కుంటల్లో చేప పిల్లలు లేటుగా వదలదం వలన కనీసం చేపలు పావు కిలో కూడా పెరగవు అని వాటిని మార్కెట్లోకి తీసుకెళ్తే కొనే దిక్కు కూడా ఉండదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు వాటిని మార్కెట్లో అమ్మేది ఎలా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి ఇచ్చే చేప పిల్లల్లో ఏమైనా అవక తవకలు లోటుపాట్లు జరిగితే సహించేది లేదని మండిపడ్డారు మరి కొద్ది రోజులలో చేప పిల్లలను పంపిణీ చేయకుంటే ముదిరాజ్ యువసేన ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో మత్స్యశాఖ కార్యాలయం ముట్టడింస్థామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
