ఉచిత సీసీటీవీ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
- మరో గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 26 మంది విద్యార్థులు అస్వస్థత - July 9, 2026
- శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు దుర్మరణం - July 9, 2026
- రూ.2,000 నోట్లపై ఆర్బీఐ తాజా ప్రకటన - July 9, 2026

- ఆర్సెటీ ఆధ్వర్యంలో 13 రోజుల ఉచిత శిక్షణ
- హాస్టల్, భోజన సదుపాయం ఉచితం
- పదో తరగతి ఉత్తీర్ణులకు అవకాశం
- కామారెడ్డి జిల్లా గ్రామీణ యువకులకు ప్రాధాన్యం
- దరఖాస్తులకు ఆర్సెటీ డైరెక్టర్ పిలుపు
కామారెడ్డి, జూలై 9 (జ్ఞాన తెలంగాణ): యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్సెటీ) ఆధ్వర్యంలో సీసీటీవీ కెమెరా ఫిట్టింగ్, రిపేరు అంశాలపై ఉచిత శిక్షణా కార్యక్రమానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్సెటీ డైరెక్టర్ అమర్ సింగ్ తెలిపారు.
మొత్తం 13 రోజులపాటు నిర్వహించే ఈ శిక్షణలో అభ్యర్థులకు పూర్తిగా ఉచిత హాస్టల్ వసతి, భోజన సదుపాయాలను కల్పించనున్నట్లు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పదో తరగతి ఉత్తీర్ణులైన పురుషులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ ప్రతులు, ఐదు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో నసురుల్లాబాద్‌లోని ఆర్సెటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా నైపుణ్యాభివృద్ధి కల్పించనున్నట్లు తెలిపారు.
మరిన్ని వివరాల కోసం 92475 40478 నంబర్‌ను సంప్రదించాలని ఆర్సెటీ యాజమాన్యం కోరింది.
