గగనవిహంగానికి ఇవి కావా అడ్డంకుల గిడ్డంగులు

విచ్చలవిడిగా ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో నిర్మాణం


జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, మార్చి 09 :

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద ఎత్తున గిడ్డంగుల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇక్కడ విమానాశ్రయం ఉన్నందున ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో పెద్ద ఎత్తున అక్రమ గిడ్డంగుల నిర్మాణాలు ఏదేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నా అటు అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది. గత రెండు నెలల క్రితం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పక్షి అడ్డుగా ఉందని చెప్పి విమానాన్ని అత్యవసరంగా దించేసిన విషయంవిదితమే, మరి ఎయిర్పోర్ట్ బార్డర్ చుట్టూరా పెద్ద ఎత్తున అక్రమ గిడ్డంగుల నిర్మాణాలు చేపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ ఇలా నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఫోటోలో ఉన్న దృశ్యం రషీద్ గూడలో ఈ గిడ్డంగి నిర్మాణం ఎత్తులో చేపడుతున్నారు. ఇలా ఎయిర్ పోర్టుకు ల్యాండింగ్ అయ్యే ప్రాంతంలో అతి ఎత్తులో ఈ నిర్మాణం జరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం నిబంధనలకు విరుద్ధంగానే కాకుండా అతిఎత్తున ఈ నిర్మాణం చేపట్టడంపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

You may also like...

Translate »