శంకర్పల్లి మున్సిపాలిటీలో జోరు అందుకున్న అండర్ డ్రైనేజీ పనులు

శంకర్‌పల్లి మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజీ పనులు జోరందుకున్నాయి. ప్రజలను ఏళ్లుగా వేధిస్తున్న మురుగునీటి సమస్యకు చరమగీతం పాడేలా మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ దూకుడుగా చర్యలు చేపట్టారు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదన్న సహకారంతో 15వ, 10వ వార్డుల్లో పనులకు శ్రీకారం చుట్టారు.
15వ వార్డులో రూ.10 లక్షల స్టాంప్ డ్యూటీ నిధులతో భూగర్భ మురుగు కాలువ, 10వ వార్డులో రూ.5 లక్షల మున్సిపల్ నిధులతో డ్రైనేజీ పనులు చేపడుతున్నారు. బహిరంగ మురుగు కాలువలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేలా పనులను వేగవంతం చేస్తున్నారు.
ప్రజల సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయిలో పరిష్కరించడంలో సాత ప్రవీణ్ కుమార్ దూకుడు చూపుతున్నారు. మురుగునీటి నిల్వలు, దోమల బెడద, పారిశుద్ధ్య సమస్యలకు అండర్ డ్రైనేజీతో గట్టి అడ్డుకట్ట పడనుంది. పనుల్లో నాణ్యత లోపాలకు తావులేకుండా అధికారులు పర్యవేక్షించాలని చైర్మన్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగేష్, వైస్ చైర్మన్ శ్వేత పాండురంగరెడ్డి, కౌన్సిలర్లు వసంత మహేందర్ రెడ్డి, గణేష్, ఆనంద్ రావ్ , కో ఆప్షన్ సభ్యులు బాలకృష్ణ రెడ్డి, మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రమౌళి, డీఈ జగదీష్ పాల్గొన్నారు.

You may also like...