Daily Archive: November 16, 2026
జ్ఞాన తెలంగాణ, రంగారెడ్డి,వెబ్ డెస్క్: నవంబర్ 17న టీఎస్సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో చేపట్టనున్న సామూహిక సెలవు కార్యక్రమానికి టీఆర్టీఎఫ్ రంగారెడ్డి జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఓపీఎస్ పునరుద్ధరించాలని జిల్లా అధ్యక్షుడు...
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని GNR గార్డెన్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు 1784 చేయూత పెన్షన్ల మంజూరు పత్రాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ మదన్ మోహన్ రావు గారు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన పేద కుటుంబాలకు చేయూత పెన్షన్ ఆర్థిక భరోసాగా నిలుస్తుందని తెలిపారు.
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి కలకలం సృష్టించాయి. కుల్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర స్థాయిలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ ఉగ్రవాది హతమైనట్లు సమాచారం. మరోవైపు ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడటం భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగించింది. ఉగ్రవాదుల సంచారానికి...
జ్ఞాన తెలంగాణ, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. ఓ కారును బలంగా ఢీకొట్టిన లారీని ఆపకుండా అలాగే కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనను గమనించిన స్థానికులు నాలుగు కార్లలో లారీని వెంబడించారు. పాస్తాపూర్ ఫ్లైఓవర్ వద్ద లారీని అడ్డుకునేందుకు ప్రయత్నించగా,...
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పరిధిలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో విషాద ఘటన చోటుచేసుకుంది. వర్సిటీ హాస్టల్ భవనం పైనుంచి దూకి 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనతో...
సంగారెడ్డి :- అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ ప్రభుత్వం నివాస స్థలాలు మంజూరు చేయాలని దళిత జర్నలిస్టుల ఫోరం (డీజేఎఫ్) హత్నూర మండల కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం హత్నూర తహసీల్దార్ పర్వీన్ షేక్ కి వినతిపత్రం సమర్పించారు. గత కొన్నేళ్లుగా హత్నూర మండలంలో జర్నలిస్టులుగా పనిచేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నామని ఆమె దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు పొందలేకపోయామని…
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం క్రీడారంగంలో ఆర్.ఆర్. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో వాలీబాల్ పోటీలతో పాటు లాంగ్ జంప్‌లో విద్యార్థులు విశేష ప్రతిభను చాటుకున్నారు.ఈ పోటీల్లో వర్ణిక, నిహారిక, మధు ప్రసన్నలు తమ ప్రతిభతో ఉత్తమ విజయాలను సాధించి బహుమతులు కైవసం చేసుకున్నారు. విద్యార్థులు సాధించిన ఈ విజయాల పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి. నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు టి….
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నాగరాజ్ గౌడ్ మారెడ్డి, బీబీపేట్ నవంబర్,16; తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మరో చారిత్రాత్మక సంక్షేమ పథకం నవంబర్ 19 నాడు “ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం” ప్రవేశ పెట్టడం పట్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ హర్ష్యం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఇందిరమ్మ కుటుంబ బీమా” పథకం ప్రవేశపెట్టి ప్రతి కుటుంబానికి 5 లక్షల ఆర్థిక…
జహీరాబాద్/పస్తపూర్ లోని S.V. ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన జహీరాబాద్ మండలానికి మరియు పట్టణానికి కొత్తగా మంజూరైన నూతన పెన్షన్ పత్రాలను మరియు స్మార్ట్ రేషన్ కార్డులను మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్ లబ్దిదారులకు పంపిణీ చేశారు..ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం…
వెల్దండ, నవంబర్ 16:వెల్దండ మండల కేంద్రంలో గుర్తుతెలియని దొంగలు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆదివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎలెస్కాన్పేటకు చెందిన అలివేలు ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌కు వెళ్లగా, దొంగలు తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.1,500 నగదును అపహరించారు. అనంతరం బీరువాను ఇంటి నుంచి కొంతదూరం ఎత్తుకెళ్లి వదిలేశారు. అలాగే దార రాములు ఇంట్లో ఉన్న…