Daily Archive: November 16, 2026

సీనియర్ కాంగ్రెస్ నాయకులు జయకృష్ణ అంత్యక్రియల్లో పాల్గొన్న పరిగి ఎమ్మెల్యే TRR

కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట్ మండలం మెట్లకుంట గ్రామానికి చెందిన PACS చైర్మన్,బ్లాక్ అధ్యక్షులు కీ.శే.జయకృష్ణ అంత్యక్రియల్లో కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఏ.తిరుపతిరెడ్డితో కలిసి పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జయకృష్ణ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి,అనంతరం పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.జయకృష్ణ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి – ఏఐటీయూసీ డిమాండ్

మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏఐటీయూసీ నాయకులు డీఆర్ఓ మాలతికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కౌన్సిల్ సభ్యుడు డీజీ నరేందర్ ప్రసాద్ మాట్లాడుతూ ఏడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో డిసెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

ప్రపంచస్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం: బండి రమేష్

కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పరిధిలో పాఠశాల నిర్మాణానికి 2.39 ఎకరాల స్థలం కేటాయించడంపై సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ సోమవారం కేపీహెచ్‌బీ రమ్య గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో పాఠశాల నిర్మాణం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో గాలి బాలాజీ, రాజేష్, శంకర్ గౌడ్, కొప్పిశెట్టి దినేష్ కుమార్, రంగమోహన్,…

విహారయాత్రలో క్రాంతి విద్యాలయం పాఠశాల విద్యార్థులు

దోమ మండలంలోని క్రాంతి విద్యాలయం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు విహారయాత్రలో భాగంగా పలు పర్యాటక ప్రాంతాలు సందర్శించి మేడారం సమ్మక్క సారలమ్మల గద్దెలను దర్శించుకున్నారు, విహారయాత్రలతో విద్యార్థులకు ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తుందని,బాల్యం గుర్తులు జీవితాంతం మదిలో ఉంటాయని ప్రధానోపాధ్యాయులు కుమార్ అన్నారు, ఈ యాత్రలో పాఠశాల అధ్యాపకుల బృందం విద్యార్థులు ఉన్నారు.

దస్తావేజు కార్యాలయం ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు వజ్రేస్ యాదవ్

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మేడ్చల్ డివిజన్ దస్తావేజుల కార్యాలయాన్ని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న రిజిస్ట్రేషన్ సేవలను పరిశీలించారు. ప్రజలకు సమీపంలోనే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. కొత్త కార్యాలయం ద్వారా ప్రజలకు రిజిస్ట్రేషన్ సంబంధిత పనులు మరింత సులభతరం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో…

అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్ధిక భరోసా.

కామారెడ్డి జిల్లాలో నూతన పింఛన్ల పంపిణి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు మాట్లాడుతూ. ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ సామజిక భద్రతతో పాటు ఆర్ధిక భరోసా కల్పించడమే లక్ష్యంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు ప్రతి పేద కుటుంబానికి భరోసా ప్రతి ఇంత సంతోషం…

సైనిక్‌ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం!

హైదరాబాద్‌: సైనిక పాఠశాలల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ద్వారా అవకాశం కల్పిస్తున్నారు. 2027–28 విద్యా సంవత్సరానికి సంబంధించి అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష (ఏఐఎస్‌ఎస్‌ఈఈ–2027) కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆరో తరగతి, తొమ్మిదో తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈ...

ప్రీ-ప్రైమరీ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ.. దరఖాస్తుల గడువు పొడిగింపు!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యా బోధనను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ పొందే అవకాశం కల్పిస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో చిన్నపిల్లల సంరక్షణ, విద్యకు సంబంధించిన ధ్రువపత్ర, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. గతంలో...

టాస్‌ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు!

హైదరాబాద్‌: చదువును మధ్యలోనే నిలిపివేసిన వారికి, వివిధ కారణాలతో పాఠశాల విద్యకు దూరమైన వారికి మరో అవకాశం లభించింది. తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (TOSS) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి (SSC), ఇంటర్మీడియట్‌ ప్రవేశాల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన...

చదువుకునే విద్యార్థులకు రైలు ప్రయాణం ఉచితం!

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌: చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థులకు ప్రయాణ ఖర్చులు భారంగా మారకూడదనే ఉద్దేశంతో భారతీయ రైల్వే శాఖ ప్రత్యేక ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తోంది. పాఠశాలలు, కళాశాలలకు ప్రతిరోజూ రాకపోకలు సాగించే అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నిబంధనల ప్రకారం బాలురు...