నీరున్నా.. క్రాప్ హాలిడేనా?
నిజాంసాగర్ ప్రాజెక్టులో 9.1 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నప్పటికీ రబీ పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించడం రైతులకు అన్యాయమని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోరల్ శ్రీనివాసరావు మండిపడ్డారు. రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆయన ఆధ్వర్యంలో రైతులతో కలిసి నిరసన చేపట్టారు. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, స్థానిక ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ…
