Monthly Archive: September 2026

బల్మూర్ మండలంలో బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్.!

బల్మూర్ సెప్టెంబర్ 06: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని బల్మూర్ మండల కేంద్రంలో సోమవారం శాంతియుతంగా ధర్నాకు సిద్ధమవుతున్న బీజేపీ మరియు బీజేవైఎం ముఖ్య నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.ప్రభుత్వ నిరంకుశ వైఖరికి, పోలీసుల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతుంటే అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. అరెస్టయిన ముఖ్య నాయకులలో బాలస్వామి యాదవ్, బల్మూర్ మండల బీజేపీ అధ్యక్షులు…

అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు.. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువు శిథిలమైన కురుమర్తి రోడ్డు…

అడుగడుగునా గుంతలు.. రాకపోకలకు అవస్థలు..20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకు మరమ్మతులు కరువుశిథిలమైన కురుమర్తి రోడ్డు…జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 06: కట్టంగూర్ నుంచి కురుమర్తి కి వెళ్లే రోడ్డు ద్వంసం కావడంతో వాహనదారులు ఇక్కట్లు వడుతున్నారు. 8 కిలో మీటర్ల మేర అడుగడుగునా గుంతలు పడి అధ్వానంగా మారింది. దీంతో ఈరోడ్డుపై వెళ్లాలంటే వాహనదారులు జంకుతున్నారు. రాత్రిపూట అయితే నరకం చూడాల్సిందే అని భయాందోళన చెందుతున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన్ కింద కట్టంగూర్ నుంచి కురుమర్తికి బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. రోడ్డు ద్వంసం కావడంతో ఓ సారి తూతూ మంత్రంగా మరమ్మత్తులు చేపట్టి చేతులుదుపుకున్నారు. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో మండలంలోని గార్లబాయిగూడెం, తేలువారిగూడెం గ్రామాలతో పాటు శాలిగౌరారం మండలం ఆకారం, వల్లాల, గురజాల గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం కురమర్తి గ్రామం మీదుగా కట్టంగూర్ కూ రాకపోకలు సాగించాలంటే జంకుతున్నారు. పెద్దపెద్ద గుంతలు ఏర్పడడంతో రెండువాహనాలు ఎదురెదురుగా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. సత్యనారాయణపురం, కురుమర్తి శివారులో రోడ్డు మద్యలో గోతులు పడడంతో అందులో పడి ఎంతో మంది ద్విచక్రవాహనదారులకు గాయాలయ్యాయి. రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని పలుమార్లు అధికారులకు, ప్రజా ప్రతినిధులకు విన్నవించిన ఫలితం లేకుండా పోయిందని ఆయా గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.  పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయాలి : బీరెల్లి రామచంద్రయ్య మాజీ ప్రజాప్రతినిధుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులునిత్యం రద్దీగా ఉంటే కట్టంగూర్ నుంచి కురుమర్తికి వెళ్లే రోడ్డును పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయాలి. గత 20 సంవత్సరాల క్రితం నిర్మించి రోడ్డు వర్షాలకు ద్వంసం అయి రోడ్డుపై గుంతలు పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. గత ఐదు సంవత్సరాల నుంది వాహనదారులు రోడ్డు పై ప్రయాణించాలంటే భయాంతోళన చెందుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించి కట్టంగూర్, శాలిగౌరారం మండల ప్రజల నిత్యం రాకపోకలు సాగించే ఈ రోడ్డుకు నిధులు మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలి

నిషేధిత భూమి రిజిస్ట్రేషన్‌.. సబ్‌ రిజిస్ట్రార్‌ అరెస్టు

నిషేధిత భూమికి అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంలో సబ్‌ రిజిస్ట్రార్‌ అరెస్టు కావడం నిజామాబాద్‌ జిల్లా రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అర్సపల్లి శివారులోని సర్వే నంబర్‌ 169/3లో...

కాంగ్రెస్ బాకీ తీర్చాలంటూ బిఆర్ఎస్ వినూత్న నిరసన

.కాంగ్రెస్ చేతిలో మోసపోయిన తెలంగాణ.. పుట్ట రాంరెడ్డి వెల్దండ సెప్టెంబర్ 06:కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి అన్నారు.బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పిలుపుమేరకు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు కానుగుల జోగయ్యలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు అధిక…

ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో నీటి ట్యాంక్ శుద్ధి

వెల్డండ సెప్టెంబర్ 05: వెల్దండ మండలంలోని కుందారం తండా గ్రామంలో నిర్వహించి త్రాగునీటి నిల్వ ట్యాంకులను స్వచ్ఛ ద్వారా కార్యక్రమంలో భాగంగా శనివారం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో జర్మన్ సాంకేతికతతో కూడిన ప్రత్యేక యంత్రాల సహాయంతో శుద్ధి చేయించడం జరిగింది. కార్యక్రమంలో కుందారం తండా గ్రామ సర్పంచ్ గన్య నాయక్, గ్రామ డిప్యూటీ సర్పంచ్ అనిత జంగు ,మరియు వార్డు సభ్యులు ,గ్రామ నాయకులు , యువకులు తదితరులు…

వైద్య విద్యార్థిని సన్మానించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్

కల్వకుర్తి సెప్టెంబర్ 05 వెల్దండ మండల కేంద్రానికి చెందిన గుద్దేటి శేఖర్ గుద్దేటి అలివేల దంపతుల కూతురు గుద్దేటి సరిత నీట్ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనభర్చి నీట్ కామారెడ్డి ప్రభుత్వ మెడికల్సీ సీటు సాధించిన విద్యార్థిని పాటు తల్లిని గ్రామపంచాయతీ ఆవరణంలో శాలువలతో సన్మానించారు.ఉన్నంత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ..గుద్దేటి సరితను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి లక్ష్యంతో కష్టపడి చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చు అని అన్నారు. అనంతరం విద్యార్థి ఖర్చులకు…

పీహెచ్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి : గౌరవ్ ఉప్పల్

పీహెచ్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి : గౌరవ్ ఉప్పల్జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 5 :కట్టంగూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆర్ధిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి, టీజీ ఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్ శనివారం రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ రవీంద్రనాయక్, డీఎంహెచ్ రాహుల్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బందిని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,…

ఘనంగా శ్రీనివాస్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా శ్రీనివాస్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలువెల్డండ సెప్టెంబర్ 5: వెల్దండ మండల ఆర్యవైశ్య సంగం యువ నాయకులు బిక్కు మాండ్ల శ్రీనివాస్ తేజస్విని వివాహ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.పలువురు అభిమానులు, బంధుమిత్రులు శ్రీనివాస్ దంపతులచే కేక్ కట్ చేయించి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పండితులు భాస్కర శర్మ వేద మంత్రాలతో ఆశీర్వచనం చెప్పారు.ఈ కార్యక్రమంలో కర్మంఘాట్ హనుమాన్ నగర్ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు ఉప్పు బాలస్వామి, ఉప్పు ఆంజనేయులు,…

వైభవోపేతంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

వైభవోపేతంగా వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంకల్వకుర్తి సెప్టెంబర్ 05: వెల్దండ మండల కేంద్రంలోని బుధవార్‌పేట ఆంజనేయస్వామి దేవాలయంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో కనులపండువగా నిర్వహించారు.వేదపండితుల మంత్రోచ్ఛారణలు,మంగళవాయిద్యాల నడుమ వెంకటేశ్వర స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా సాగాయి పూరి రాంప్రకాష్ దంపతులు కల్యాణోత్సవాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డీసీసీ ఉపాధ్యక్షులు ఎన్నం భూపతిరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ జిల్లా మాజీ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ సర్పంచ్ మట్ట యాదమ్మ, వెంకటయ్యగౌడ్ హాజరై కల్యాణోత్సవాన్ని తిలకించారు. ఈ సందర్భంగా వారు…

బొల్లంపల్లిలో కమనీయంగా ఉట్ల పండుగ వేడుకలు

వెల్దండ సెప్టెంబర్ 05: వెల్దండ మండల పరిధిలోని బొల్లంపల్లి గ్రామంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉట్ల వేడుకలను కమనీయంగా నిర్వహించారు.ఈ వేడుకలకు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. శ్రీ కృష్ణ జన్మాష్టమి వంటి పర్వదిన వేడుకలు మన…