కాంగ్రెస్ బాకీ తీర్చాలంటూ బిఆర్ఎస్ వినూత్న నిరసన
- కాంగ్రెస్ బాకీ తీర్చాలంటూ బిఆర్ఎస్ వినూత్న నిరసన - September 6, 2026
- ఐక్యత పౌండేషన్ ఆధ్వర్యంలో నీటి ట్యాంక్ శుద్ధి - September 6, 2026
- వైద్య విద్యార్థిని సన్మానించిన సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ - September 6, 2026
.కాంగ్రెస్ చేతిలో మోసపోయిన తెలంగాణ.. పుట్ట రాంరెడ్డి
వెల్దండ సెప్టెంబర్ 06:కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చడంలో విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి అన్నారు.బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలు, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ పిలుపుమేరకు మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిరంజన్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు కానుగుల జోగయ్యలతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రదర్శిస్తూ, డబ్బులు చాటిస్తూ, వీధి వీధి తిరుగుతూ ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. మహిళలకు 2500, రైతు భరోసా, తులం బంగారం, విద్యార్థినిలకు స్కూటీలు, విద్యార్థులకు స్కాలర్షిప్పులు వంటి బాకీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు నిరంజన్ ,లింగం, సీనియర్ నాయకులు ప్రభాకర్, వార్డు సభ్యులు ఆనంద్, శేఖర్, పోలె చంద్రశేఖర్, క్రూజర్ శ్రీనులతో పాటు పార్టీ శ్రేణులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
