Monthly Archive: September 2026
వెల్దండ : మండలంలోని రాచూరు గ్రామ రైతువేదికలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి శోభారాణి ఆధ్వర్యంలో సహజ వ్యవసాయంపై అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయన ఎరువులు తగ్గించి జీవామృతం, బీజామృతం, ఘన జీవామృతం తయారీపై వ్యవసాయ అధికారులు రైతులకు శిక్షణ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని, నేల ఆరోగ్యం మెరుగవుతుందని సూచించారు.
వెల్దండ సెప్టెంబర్ 15 : వెల్దండ మండల కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వినాయకుని సన్నిధిలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షులు భూపతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గణనాథుని ఆశీస్సులతో మండల ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భరత్ గౌడ్, కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, క్యాషారపు వెంకటయ్యలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు,…
వెల్దండ / పోతేపల్లి15: వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలో చేయూత పెన్షన్ల పరిశీలనలో భాగంగా స్పెషల్ ఆఫీసర్ శ్రీ రాంరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.గ్రామంలో ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల వివరాలను స్వయంగా పరిశీలించారు. పత్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ రాంరెడ్డి గారు మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పెన్షన్ అందాలి, అనర్హులకు ఒక్క రూపాయి కూడా వెళ్లకూడదు – ఇదే మా లక్ష్యం పెన్షన్ల పరిశీలనలో పారదర్శకతే ముఖ్యం, అవినీతికి తావు లేకుండా పేదలకు…
వెల్దండ: వెల్దండ మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొలువుదీరిన విఘ్నేశ్వరుని బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆయన వెంట స్థానిక యువత, బీఆర్ఎస్ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఉత్సవ కమిటీ సభ్యులు కానుగుల జోగయ్యను శాలువాతో సన్మానించారు.
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి ప్రధాన కూడలి ఇంద్రారెడ్డి చౌరస్తా వద్ద రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారింది. చౌరస్తా వద్ద భారీ గుంతలు ప్రమాదాలకు బహిరంగ ఆహ్వానం పలుకుతున్నా అధికారులకు మాత్రం పట్టినట్టే లేదు. గుంతలను తప్పించుకునేందుకు వాహనదారులు రోడ్డుపై అడ్డంగా మళ్లుతుండటంతో ఎదురుగా వచ్చే వాహనాలతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న భయం నెలకొంది. ప్రజలు నిత్యం నరకయాతన పడుతున్నా అధికారుల నిర్లక్ష్యం మాత్రం హద్దులు దాటుతోంది. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన తర్వాతే మేల్కొనే పాలన ఎందుకని?…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఈ భేటీ జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న 22ఏ అంశంతో పాటు పలు కీలక విషయాలపై ముఖ్యమంత్రి మంత్రులతో సమీక్షించనున్నట్లు సమాచారం. రెవెన్యూ సంబంధిత సమస్యలు, 22ఏ...
జ్ఞానతెలంగాణ, శంకర్‌పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో మహనీయుల ఉత్సవాల కమిటీ నూతన కార్యవర్గాన్ని ఈ నెల 20వ తేదీ ఆదివారం ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ మండల చైర్మన్ బి. శంకర్ తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామం నుంచి ప్రతినిధులు, మహనీయుల ఆశయాలను విశ్వసించే ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి తరలిరావాలని పిలుపునిచ్చారు.శంకర్‌పల్లి మండలంలోని బీడీఎల్ చౌరస్తా వద్ద గల రైమండ్స్ షోరూమ్ పైన రెండో అంతస్తులోని జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి ఆఫీస్ కార్యాలయంలో నూతన కార్యవర్గ…
శంకర్‌పల్లి : శంకర్‌పల్లి మండల డిప్యూటీ MROగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కార్తీక్ను బీసీ సంక్షేమ సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షులు బండమీది వెంకటేష్ ఘనంగా సన్మానించారు. మంగళవారం శంకర్‌పల్లిలోని డిప్యూటీ MRO కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బండమీది వెంకటేష్ డిప్యూటీ MRO కార్తీక్‌కు భగవద్గీతను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. నూతన బాధ్యతల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా సేవలందించాలని ఆకాంక్షించారు.శంకర్‌పల్లి మండలంలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారంలో అధికారులు ప్రజలకు అందుబాటులో…
వెల్దండవెల్దండ మండలం నగరగడ్డ తండా గ్జరామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీశ్రీ ముత్యాలమ్మ దేవాలయానికి కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనీలా సంజీవ్ కుమార్ యాదవ్ రూ.25,000/-ఆర్థిక సహాయం అందజేశారు.ఈ మేరకు ఆలయ నిర్మాణ కమిటీకి సంబంధించిన చెక్కును తండా గ్రామ పెద్దల సమక్షంలో అందజేశారు. గ్రామంలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆలయ నిర్మాణానికి ఈ విరాళం ఎంతగానో దోహదపడుతుందని గ్రామస్తులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్. లాలు నాయక్, వస్య నాయక్, సబావత్ నాను, చందర్,…
బెజ్జూర్: మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై విజయ్‌ను వాలీబాల్ క్రీడాకారులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై విజయ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. గ్రామాభివృద్ధితో పాటు క్రీడల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో వాలీబాల్ క్రీడాకారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.