Daily Archive: September 19, 2026
వెల్దండ సెప్టెంబర్ 18: కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని వెల్దండ మండలంలో తొమ్మిదో పోషణ మాసం కార్యక్రమాలపై మండల స్థాయి కన్వర్జెన్స్ సమావేశం శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా పోషణ మాసం కార్యక్రమాల నిర్వహణ,ప్రజల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడం,అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులు సమగ్రంగా చర్చించారు.గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం, సమతుల్య ఆహారం,ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పోషణ మాసం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.సమావేశంలో…
వెల్దండ: మండలంలోని చౌదర్ పల్లి గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీకి సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు.వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ యువకులు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలుస్తూ భాస్కర్ రావు ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. డీజే సౌండ్ బాక్సుల ఏర్పాటుకు, ఇతర ఏర్పాట్లకు ఈ నగదును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు చైర్మన్ కు కృతజ్ఞతలు…
కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామానికి చెందిన గోలి సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కీలక పదవి బాధ్యతలు అప్పగించారు.రెవెన్యూ డివిజనల్ స్థాయి అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ATMA) చైర్మన్ గా సుదర్శన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వ్యవసాయ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.తాండ్ర సుదర్శన్ రెడ్డికి కీలక పదవి
ఆమనగల్, సెప్టెంబర్ 18: వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఆమనగల్ పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా ఆమనగల్‌లోని సూర సముద్రం చెరువు నిమజ్జన ప్రాంతాన్ని మహేశ్వరం జోన్ డీసీపీ కె. నారాయణ రెడ్డి, మహేశ్వరం డివిజన్ ఏసీపీ ఎస్. జానకి రెడ్డి శుక్రవారం సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.నిమజ్జన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులు సూచించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్ పత్యా నాయక్,…
పంట చేతికొచ్చే వేళ.. నీళ్లెక్కడ?నల్గొండకు రావాల్సిన నీటిని ఖమ్మం, ఆంధ్రాకు తరలించడం అన్యాయం..మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యజ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 18: నార్లు పోశారు.. నాట్లు వేశారు.. పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు.. ఇంకో పది, పదిహేను రోజుల్లో చేతికొస్తుందనుకున్న పంటకు ఇప్పుడు నీళ్లే కరువయ్యాయి. పంట కోత దశకు చేరుకున్న సమయంలో సాగునీరు అందక పొలాలు ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం…
పాఠశాల లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలు అందజేతజ్ఞాన తెలంగాణ జనగామ ప్రతినిధి, సెప్టెంబర్ 18జనగామలోని మన జెడ్పీహెచ్‌ఎస్ ధర్మకంచె పాఠశాలలో 1982–83 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థి రమేష్ కుమార్ బజాజ్ పాఠశాల లైబ్రరీకి రూ.20 వేల విలువైన పుస్తకాలను అందజేశారు. అలాగే పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు టాప్ ర్యాంకర్లకు నగదు పారితోషికాలను అందజేశారు.ఈ సందర్భంగా జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలల సీడీసీ చైర్మన్ గట్టు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పూర్వ విద్యార్థి…
వెల్దండ సెప్టెంబర్ 18:మండలంలోని అజిలాపూర్ గ్రామంలో లోవోల్టేజీ సమస్య కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచ్ సిద్ధగోని రమేష్ గౌడ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు డీసీసీ కార్యదర్శి శంకర్ నాయక్,వార్డు సభ్యులు జక్కుల మల్లేష్ యాదవ్,బండోనిపల్లి సర్పంచ్ ఎనుముల సంగీత శేఖర్ రెడ్డి స్పందించారు.అవసరమైన గ్రామాలకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు అందించినట్లు…
జనగామలోని జీఎంఆర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కాలనీవాసులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాశెట్టి నరేష్– బస్వ సత్యనారాయణ దంపతులు, వీరన్న దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందారు.
జనగామ, సెప్టెంబర్ 18: 22-ఏ నిషేధిత భూములు, ప్రభుత్వ, అసైన్డ్ భూములపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ యాదవ్, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యమ సమయంలో భూములు లేని కొందరికి పదేళ్లలో వందల ఎకరాలు ఎలా వచ్చాయో లెక్క తేల్చాలని కోరారు. ధరణి రికార్డుల్లో మార్పులు, భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు, యాజమాన్య బదలాయింపులపై విచారణ…
నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 18: వెదురు వనరులను సమర్థవంతంగా వినియోగించుకుని ఆర్థిక ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య అన్నారు. అంతర్జాతీయ వెదురు దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వెదురుతో వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చన్నారు. వెదురు ఆధారిత పరిశ్రమలు, హస్తకళలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ…