గణేష్ ఉత్సవ కమిటీకి ఆర్థిక సహాయం
- కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అన్నాదానం : - September 19, 2026
- గణేష్ ఉత్సవ కమిటీకి ఆర్థిక సహాయం - September 19, 2026
- తాండ్ర సుదర్శన్ రెడ్డికి కీలక పదవి - September 19, 2026
వెల్దండ: మండలంలోని చౌదర్ పల్లి గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీకి సింగిల్ విండో చైర్మన్ భాస్కర్ రావు రూ.25 వేల ఆర్థిక సాయం అందజేశారు.వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు గ్రామ యువకులు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలుస్తూ భాస్కర్ రావు ఈ ఆర్థిక సహాయాన్ని అందించారు. డీజే సౌండ్ బాక్సుల ఏర్పాటుకు, ఇతర ఏర్పాట్లకు ఈ నగదును వినియోగించుకోవాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ యువకులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవ కమిటీకి ఆర్థిక సహాయం
