బాలల బంగారు భవిష్యత్తుకు పోషకాహారమే పునాది – వెల్దండలో సమన్వయ సమావేశం
- వెల్దండకు వెలుగులు – 100 కెవి ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన సర్పంచ్ - September 19, 2026
- కల్వకుర్తిలో విషాద ఘటన వినాయక మండపం వద్ద విద్యుత్ షాక్ తో యువకుడు బలి - September 19, 2026
- బాలల బంగారు భవిష్యత్తుకు పోషకాహారమే పునాది – వెల్దండలో సమన్వయ సమావేశం - September 19, 2026

వెల్దండ సెప్టెంబర్ 18: కల్వకుర్తి ప్రాజెక్టు పరిధిలోని వెల్దండ మండలంలో తొమ్మిదో పోషణ మాసం కార్యక్రమాలపై మండల స్థాయి కన్వర్జెన్స్ సమావేశం శుక్రవారం నిర్వహించారు.ఈ సందర్భంగా పోషణ మాసం కార్యక్రమాల నిర్వహణ,ప్రజల్లో పోషకాహారంపై అవగాహన కల్పించడం,అంగన్వాడీ కేంద్రాల ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులు సమగ్రంగా చర్చించారు.గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారం, సమతుల్య ఆహారం,ఆరోగ్యంపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. పోషణ మాసం కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.సమావేశంలో ఎంపీడీవో సులోచన,మెడికల్ ఆఫీసర్ సింధు,వెటర్నరీ డాక్టర్ వనజ,ఏఈ పల్లవి,సీడీపీఓ భాగ్యమ్మ,ఐకేపీ సిబ్బంది కిస్తమ్మ,హెచ్.యూ.బి సునీత, సఖి అరుణ,పోషణ అభియాన్ కోఆర్డినేటర్ విజ్ఞాన్, వెంకట్, సూపర్వైజర్లు సరిత రెడ్డి, జ్యోతి, శంకరమ్మతో పాటు మండలంలోని పెద్దాపూర్, చెర్కూర్,వెల్దండ అంగన్వాడీ సెక్టార్ల టీచర్లు పాల్గొన్నారు.
