తెలంగాణ జట్టుకు స్పోర్ట్స్ డ్రెస్‌లు స్పాన్సర్ చేసిన పరిగి ఎమ్మెల్యే డా రామ్మోహన్ రెడ్డి

ఈ నెల 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో నిర్వహించనున్న 45వ జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్న తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారులకు పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్పోర్ట్స్ డ్రెస్‌లు (ట్రాక్‌సూట్‌లు) స్పాన్సర్ చేశారు.ఈ సందర్భంగా క్రీడాకారులకు ట్రాక్‌సూట్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కొప్పుల రఘుమోహన్ రెడ్డి,తెలంగాణ ఖోఖో అసోసియేషన్ సెక్రెటరీ కృష్ణమూర్తి,నల్గొండ జిల్లా ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు…