అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి అండగా సీఎంఆర్‌ఎఫ్.. రూ.20 వేల సాయం అందజేత
- ఇబ్బందిలేని ఇందిరమ్మ రాజ్య సాధనే ప్రజా పాలన లక్ష్యం.. సర్పంచ్ వెంకటయ్య - November 9, 2026
- కావలి వెంకటయ్య అరెస్టును ఖండించిన ఎండి సిరాజ్..! - November 9, 2026
- దక్షిణ కాశీకి వెలుగులు..! సొంత నిధులతో లైట్లు ఇచ్చిన సర్పంచ్ సంగీత శేఖర్ రెడ్డి.! - November 9, 2026

అమనగల్, నవంబర్ 09: పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య చికిత్సల సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ఆర్థికంగా అండగా నిలుస్తోందని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.అమనగల్ మండలం పోలేపల్లి గ్రామ పరిధిలోని మంగల్ కుంట తండాకు చెందిన కేతావత్ లఖ్య నాయక్ కుమారుడు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స పొందారు. చికిత్స అనంతరం సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా, రూ.20 వేల సాయం మంజూరైంది.గోలి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో మంజూరైన రూ.20 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో బాలుడి తండ్రి లఖ్య నాయక్‌కు అందజేశారు.ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్, నల్లచెరువు మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
