కేంద్రం నిర్ణయంతో గ్రామీణ పేదలకు సొంతింటి కల సాకారం: పద్మ అనిల్ ముదిరాజ్
- కల్వకుర్తి ఎమ్మెల్యే చేతుల మీదుగా రేపు వేరుశనగ విత్తనాల పంపిణీ - September 20, 2026
- కేంద్రం నిర్ణయంతో గ్రామీణ పేదలకు సొంతింటి కల సాకారం: పద్మ అనిల్ ముదిరాజ్ - September 20, 2026
- ఎర్రవల్లి భూ నిర్వాసితుల దీక్షలు 293వ రోజుకు చేరిక - September 20, 2026
కల్వకుర్తి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ్ (PMAY-G) పథకం కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు BJYM అసెంబ్లీ కన్వీనర్, తలకొండపల్లి మాజీ ఉప సర్పంచ్ పద్మ అనిల్ ముదిరాజ్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని అర్హులైన పేద కుటుంబాలకు పక్కా ఇళ్ల నిర్మాణానికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "అందరికీ ఇల్లు" లక్ష్యంలో భాగంగానే తెలంగాణకు ఈ భారీ కేటాయింపు జరిగిందని పేర్కొన్నారు.ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని గ్రామీణ పేద కుటుంబాల సొంత ఇంటి కల సాకారం కానుందని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అన్నారు.
