అమ్రాబాద్ టైగర్ రిజర్వులో జంగిల్ సఫారీ పున ప్రారంభం

1001227206.jpg

అమ్రాబాద్:నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో మూడు నెలల విరామం తర్వాత జంగిల్ సఫారీ తిరిగిప్రారంభమైంది.వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం దృష్ట్యా ప్రతి ఏటా జులై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు సఫారీని అటవీ శాఖ నిలిపివేస్తుంది.ఈ మూడు నెలల పాటు అడవిలో జంతువుల స్వేచ్ఛా విహారానికి, ప్రశాంతతకు భంగం కలగకుండా పర్యాటకుల ప్రవేశాన్ని నిషేధించారు.ఈ గడువు ముగియడంతో అమ్రాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ యష్ ప్రకాష్ సింగల్ సఫారీని లాంఛనంగా ప్రారంభించారు. దీంతో పర్యాటకులకు మళ్లీ నల్లమల అందాలు, పులులు, ఇతర వన్యప్రాణులను దగ్గరగా చూసే అవకాశం లభించింది. పర్యాటకులు అటవీ శాఖ నిబంధనలు పాటించాలని, సఫారీ సమయంలో వేగ పరిమితి అతిక్రమించవద్దని అధికారులు సూచించారు.

You may also like...