సౌమ్యకు ఎంబీబీఎస్ సీటు: అభినందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి
- లింగారెడ్డి పల్లి లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు - October 2, 2026
- మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం - October 2, 2026
- సౌమ్యకు ఎంబీబీఎస్ సీటు: అభినందించిన గోలి శ్రీనివాస్ రెడ్డి - October 2, 2026
కల్వకుర్తి: మండలంలోని తర్నికల్ గ్రామానికి చెందిన వాటం శ్రీశైలం కుమార్తె సౌమ్యకు సిద్దిపేట జిల్లాలో ఎంబీబీఎస్ సీటు లభించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

సౌమ్యను ప్రత్యేకంగా అభినందించిన ఆయన, ఆమె ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసేందుకు ఐదు సంవత్సరాల పాటు స్టడీ మెటీరియల్తో పాటు ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పేద కుటుంబం నుంచి వచ్చి వైద్య విద్యలో సీటు సాధించడం అభినందనీయమని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వట్టేపు బాలయ్య, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు రుక్ముద్దీన్, వార్డు మెంబర్ బచ్చలకూర మాణిక్యారావు, బీఆర్ఎస్ గ్రామ నాయకులు తాళ్ల సురేష్ గౌడ్, వర్కలా దేవయ్య, వాటం శ్రీశైలం, వాటం రవి తదితరులు పాల్గొన్నారు.
