సనత్ నగర్ ‘టిమ్స్’లో స్పెషాలిటీ సర్జరీలు ప్రారంభం.. నేటి నుంచే రోగులకు అందుబాటులోకి.
- కిస్మత్పూర్ దర్గా విలేజ్‌లో వీధి దీపాల మరమ్మతులు చొరవ చూపిన బీఆర్ఎస్ నాయకులు. - October 2, 2026
- నార్సింగిలో దారుణం ఉస్మానియా పీహెచ్డీ విద్యార్థి క్రికెట్ బ్యాట్‌తో కొట్టి దారుణ హత్య. - October 2, 2026
- సనత్ నగర్ ‘టిమ్స్’లో స్పెషాలిటీ సర్జరీలు ప్రారంభం.. నేటి నుంచే రోగులకు అందుబాటులోకి. - October 2, 2026

హైదరాబాద్: నగరంలోని సనత్ నగర్ తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) ఆసుపత్రి మరో కీలక మైలురాయిని అధిగమించింది. అక్టోబర్ 1, 2026 (గురువారం) నుంచి ఈ ఆసుపత్రిలో స్పెషాలిటీ సర్జరీ (శస్త్రచికిత్స) సేవలను అధికారికంగా ప్రారంభించారు.
ఇప్పటి వరకు సనత్ నగర్ టిమ్స్‌లో కేవలం ఔట్ పేషెంట్ (OP), ఇన్ పేషెంట్ (IP) వైద్య సేవలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉండేవి. తాజాగా అత్యాధునిక వసతులతో సర్జరీ సేవలను కూడా ప్రారంభించడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం మరింత చేరువకానుంది.
ఓపీ, ఐపీ సేవలతో పాటు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ప్రత్యేక శస్త్రచికిత్సలు అందుబాటులోకి వచ్చాయి.
తేదీ: 01-10-2026 నుంచి ఈ సర్జరీ సేవలు రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సేవలతో నిరుపేద రోగులకు ఉచితంగా, నాణ్యమైన కార్పొరేట్ స్థాయి స్పెషాలిటీ ఆపరేషన్లు జరిగే అవకాశం లభించింది.
ఈ స్పెషాలిటీ సర్జరీల ప్రారంభంతో సనత్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకే కాకుండా, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు కూడా ఎంతో మేలు చేకూరనుంది.
