గాజులరామారంలో ఘనంగా కోటి దీపోత్సవం

గాజులరామారంలోని శ్రీశ్రీశ్రీ నకులేశ్వరి దేవి సిద్ధి పీఠం ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన కోటి దీపోత్సవం వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకేఎం ట్రస్ట్ చైర్మన్, మేడ్చల్–మల్కాజిగిరి డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక దీపారాధన భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందిస్తుందని, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తుందని పేర్కొన్నారు. నిర్వాహకులను అభినందించారు. అనంతరం కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు బుచ్చిరెడ్డి, పున్నారెడ్డి, బాలప్ప, అంజిరెడ్డి, సాగర్, దంపబోయిన శ్రీనివాస్, రాజిరెడ్డి, గుబ్బల రమణ, సంతోష్‌తో పాటు పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

You may also like...