అంతప్పగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ
- చదువుతోనే తలరాత మారుతుంది - August 14, 2026
- రాజ్యాంగాన్ని గౌరవిద్దాం:రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - August 14, 2026
- ప్రజావాణికి పకడ్బందీ కార్యాచరణ - August 14, 2026

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి :అంతప్పగూడ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్ దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లగొని బీరయ్య చేతుల మీదుగా విద్యార్థులకు యూనిఫామ్ దుస్తులను అందజేశారు. విద్యార్థులు సక్రమంగా పాఠశాలకు హాజరై, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని సర్పంచ్ ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్వప్న సత్యనారాయణ, గ్రామ కార్యదర్శి మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు శోభ, నాగేష్, వినోద్, యాదయ్య, జాన్సీ విజయ్, సురేష్, జంగయ్య పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేజియా, ఉపాధ్యాయులు సుదర్శన్, హేమలత, పాఠశాల సిబ్బంది ప్రవీణ్, సునీత, ఎస్‌హెచ్‌జీ సభ్యులు పద్మమ్మ, అలవేలి, వీఓఏ మమత, సీసీ సుధాకర్, ఫీల్డ్ అసిస్టెంట్ సంజీవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అలాగే గ్రామస్తులు కొండ పెంటయ్య, మల్లేష్, చంద్రయ్య తదితరులు హాజరయ్యారు. యూనిఫామ్ దుస్తులు అందుకోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో సమానత్వ భావన, పాఠశాల పట్ల ఆసక్తి పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఉపాధ్యాయులు తెలిపారు.
