కాలిఫోర్నియా హెల్త్‌ఫెస్ట్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్‌ ప్రతినిధి, అక్టోబర్‌ 4: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అమెరికాలో జరిగే టీఏఎల్‌ హెల్త్‌ఫెస్ట్‌లో పాల్గొనాలని ఆహ్వానం అందింది. కాలిఫోర్నియాలోని శాన్‌డియాగోలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో ఈనెల 30న సదస్సు నిర్వహించనున్నారు. టచ్‌-ఎ-లైఫ్‌ సీఈవో సాయి గుండవెల్లి కేటీఆర్‌కు ఆహ్వానం పంపారు. ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, వైద్య సేవలు, ప్రజారోగ్యంపై సదస్సులో చర్చలు జరగనున్నట్లు సమాచారం. కార్యక్రమంలో కేటీఆర్‌ పాల్గొనే అంశంపై ఆసక్తి నెలకొంది.

You may also like...