శంకర్‌నగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జ్ఞాన తెలంగాణ, కొహెడ ప్రతినిధి: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం శంకర్‌నగర్‌ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో వరంగల్‌ జిల్లాకు చెందిన చెంచు రాజు ఉన్నట్లు గుర్తించారు. ఆయన వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ప్రమాదానికి కారణమైన వాహనం అక్కడి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు దాని ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like...