Author: PAKADI RAMANJANEYULU

అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం.. తహసిల్దార్ కార్తీక్ కుమార్

వెల్దండలో 19,889 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ – తహసీల్దార్ కార్తీక్ కుమార్వెల్దండ సెప్టెంబర్ 08: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని తహసీల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ అన్నారు. మంగళవారం వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దండ మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు 19,889 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయని, అందులో అదనంగా 12…

పోచమ్మ బోనాలు విజయవంతం చేయండి.. సర్పంచ్ ప్రసాద్ గౌడ్

బొల్లంపల్లి, సెప్టెంబర్ 08: బొల్లంపల్లి, చల్లపల్లి, అంకమోనికుంట, ఈదమ్మ బండ తండా గ్రామాల ప్రజలందరికీ బొల్లంపల్లి గ్రామ సర్పంచ్ సత్తూరి ప్రసాద్ గౌడ్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.రేపు బుధవారం సెప్టెంబర్ 9న గ్రామంలోని పోచమ్మ ఆలయంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు*. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. బోనాల వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

దళిత స్పీకర్ ను అవమానించిన తాత మధు పై చర్యలు తీసుకోవాలి.. పుల్లయ్య

వెల్దండ సెప్టెంబర్ 08 : దళిత స్పీకర్ ను అవమానించిన బీఆర్ఎస్ నేత తాత మధు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెల్దండ మండలంలో కాంగ్రెస్ సీనియర్ నేత కొయ్యల పుల్లయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. దళిత స్పీకర్ ను అవమానించడం దారుణమని, ఇది బీఆర్ఎస్ దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.తాత మధు పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.న్యాయం జరిగే వరకు…

రాజ్యాంగ నిర్మాత సాక్షిగా ప్రజా హక్కులపై వినతి.. భారత రాష్ట్ర సమితి

వెల్దండ సెప్టెంబర్ 08:వెల్దండ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వెల్దండ భారత రాష్ట్ర సమితి మండల అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆహార కమిషన్ అధ్యక్షులు గోలి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకై వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వినతి చేస్తున్నామని, 2023 ఎన్నికల్లో ఇచ్చిన 6…

స్వచ్ఛమైన నీరు – సంపూర్ణ ఆరోగ్యమే ఐక్యత పౌండేషన్ లక్ష్యం: సుంకిరెడ్డి

వెల్దండ 08: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంకమోనికుంట గ్రామంలో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ధార కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఐక్యత ఫౌండేషన్ వ్యవస్థాపకులు, టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో జర్మన్ టెక్నాలజీతో తయారైన ప్రత్యేక యంత్రాలతో నీటి ట్యాంక్ ను శుభ్రపరిచారు.గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.శుద్ధ జలం అందించి ప్రజల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నామని, ప్రతి బొట్టు స్వచ్ఛత కోసం…

పేద కుటుంబానికి గోలి ఆపన్న హస్తం.. అనిత గృహ నిర్మాణానికి చేయూత

వెల్లడం సెప్టెంబర్ 08:వెల్దండ మండల పరిధిలోని రాచుర్ గ్రామానికి చెందిన తెలగమళ్ళ అనిత రవికుమార్ గృహ నిర్మాణానికి మంగళవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసి ఉదారత చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల చీకటి జీవితాలలో వెలుగులు నింపేందుకు గృహ నిర్మాణాలకు తన వంతుగా సహకారం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి, మండల పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ…

వెల్దండ శివుని గుట్ట గుండంలో విరబూసిన తామరలు

వెల్దండ సెప్టెంబర్ 07 : నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని శివుని గుట్ట గుండంలో తెల్ల కలువ పుష్పాలు విరబూశాయి.ఆదివారం ఉదయం గుండంలో మూడు పువ్వులు వికసించడం భక్తులు ఆనందంతో వీక్షించారు.శివుడికి తెల్ల తామరలు అత్యంత ప్రీతికరమని అర్చకులు తెలిపారు.ఒకేసారి మూడు పువ్వులు పూయడం శుభ సూచకమని భక్తులు భావిస్తున్నారు. వీక్షించి ఫోటోలు తీసేందుకు భక్తులు గుండం వద్దకు అధిక సంఖ్యలో చేరుకున్నారు. భక్తుల సౌకర్యార్థం కోసం గుండం చుట్టూ ప్రహరీని నిర్మించి, మెట్లు…

కడ్తాల్ లో ఘనంగా బోనాలు ఉత్సవాలు.. ముఖ్య అతిథిగా పాల్గొన్న విజితా రెడ్డి

కడ్తాల్, సెప్టెంబర్ 7:రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యమకారురాలు, మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్,వెల్దండ మాజీ జెడ్పీటీసీ విజితా రెడ్డిహాజరయ్యారు. ఆమె బోనం ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించారు.గ్రామంలోని అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు ప్రధాన వీధుల మీదుగా కోలాహలంగా సాగింది. మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో పాల్గొన్నారు.అనంతరం ఆమె మాట్లాడుతూ..బోనాల పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని,అమ్మవారి…

నాగర్ కర్నూలు జిల్లాలో 255 అంగన్వాడీ పోస్టులు ఖాళీ

*నాగర్ కర్నూల్ జిల్లాలో 255 అంగన్వాడీ పోస్టులు ఖాళీ*నాగర్ కర్నూల్ 07: జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 255 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.జిల్లా సంక్షేమ శాఖ ప్రకటన ప్రకారం – అచంపేట్ లో 77, బల్మూర్ లో 64, కల్వకుర్తిలో 38, కొల్లాపూర్ లో 34, నాగర్ కర్నూల్ లో 42 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 148 అంగన్వాడీ టీచర్, 107 ఆయా పోస్టులు ఉన్నాయి.అర్హులైన మహిళలుhttp://wdcw.tg.nic.in వెబ్…

కంటోని పల్లిలో అంబరాన్ని తాకిన “జైశ్రీరామ్ నినాదాలు”

వెల్దండ సెప్టెంబర్ 07: వెల్దండ మండలంలోని కంటోనీపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి శోభాయాత్ర కనులపండువగా జరిగింది. గ్రామ ఆంజనేయస్వామి ఆలయం నుంచి ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన వీధుల మీదుగా సాగింది.కాషాయ కండువాలు ధరించిన యువకులు, భక్తులు 'జై శ్రీరామ్, జై హనుమాన్' నినాదాలతో హోరెత్తించారు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని భుజాలపై మోస్తూ భక్తి శ్రద్ధలతో ఊరేగించారు.గ్రామ ప్రజలు భక్తిశ్రద్ధలతో వేడుకల్లో పాల్గొంటూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని నిర్వాహకులు తెలిపారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్…