Author: PAKADI RAMANJANEYULU
వెల్దండ సెప్టెంబర్ 10: డిండి – నార్లాపూర్ డి-82 ప్రాజెక్టులో భాగంగా ఇర్విన్ – అజిలాపూర్ రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న బాధితులు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.అజిలాపూర్ సర్పంచ్ సిద్దగోని రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసిన రైతులు,నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఎకరాకు 20 లక్షలు ఇచ్చిన విధంగా తమకు కూడా పరిహారం ఇవ్వాలని కోరారు.భూములే నమ్ముకుని జీవిస్తున్న తమకు ప్రభుత్వం ఆదుకోవాలని వారు వేడుకున్నారు. దీనిపై…
కల్వకుర్తి సెప్టెంబర్ 09 :కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవితో కలిసి బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లను మర్యాదపూర్వకంగా కలిశారు.ఇటీవల శాసనమండలి సభ్యుడు తాతా మధు స్పీకర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు, ప్రవర్తనపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్పీకర్ కు సంఘీభావం తెలిపారు.మంత్రి శ్రీధర్ బాబును కలిసి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు…
మాడ్గుల సెప్టెంబర్ 09: మాడ్గుల మండలం కుభ్యతాండ గ్రామపంచాయతీకి చెందిన నేనావత్ రాజ్యకు తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.60,000/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.ఆపదలో ఉన్న పేద, సామాన్య కుటుంబాలకు అండగా నిలుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా గోలి శ్రీనివాస్ రెడ్డి ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమార్,బీఆర్ఎస్ నాయకులు శ్రీను,లక్ష్మిపతి తదితరులు పాల్గొన్నారు.
వెల్దండ, సెప్టెంబర్ 09: చారగొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామ భూ నిర్వాసితుల దీక్షలు 282 రోజులకు చేరాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ పిలుపు మేరకు కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా మంగళవారం వెల్దండ బస్టాండ్ ఆవరణలో జలసాధన దినాన్ని ఘనంగా జరుపుకున్నారు.డిండి ఎత్తిపోతల పథకం రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 12న నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చేపట్టనున్న సత్యాగ్రహ దీక్ష కరపత్రాలను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల…
వెల్దండ, సెప్టెంబర్ 09 : వెల్దండ మండలంలోని బండోనిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ ఎనుముల సంగీత – శేఖర్ రెడ్డి, ఉప సర్పంచ్ అల్వాల్ యాదవుల ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్,ఉప సర్పంచులుమాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్ రేషన్ కార్డుల వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా రేషన్ అందుతుందని, ప్రభుత్వ సంక్షేమ…
వెల్దండ, సెప్టెంబర్ 09: వెల్దండ మండల కేంద్రంలోని రామ్ నగర్ కాలనీలో బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలు నెత్తిపై బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా పోచమ్మ దేవాలయానికి తరలివెళ్లారు. ప్రతి కుటుంబం బోనం సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదళ్ ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కల్వకుర్తి సెప్టెంబర్ 09 :కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలోని శ్రీ కృష్ణ దేవాలయంలో శ్రీ కృష్ణ హోమం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కల్వకుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ సంజీవ్ యాదవ్ మాట్లాడుతూ.. భక్తి, ఆధ్యాత్మికతే మనిషి జీవితానికి మార్గదర్శకమని,ఇలాంటి హోమాల వల్ల గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని అన్నారు.భగవంతుని ఆశీస్సులతోనే అభివృద్ధి సాధ్యమని, యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జియగూడ యాదవ సంఘం అధ్యక్షుడు జక్కుల చిన్న జంగయ్య యాదవ్, భైరాపూర్ సర్పంచ్ రాజు యాదవ్,…
వెల్దండ సెప్టెంబర్ 09: వెల్దండ మండలంలోని గుండాల గ్రామంలో గల ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటారు. సికింద్రాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన జాతీయ స్థాయి సాంస్కృతిక పోటీలలో హిందీ గేయం, తెలుగు జానపద గేయం విభాగాల్లో ప్రథమ బహుమతి సాధించి వరుసగా రెండోసారి విజేతలుగా నిలిచారు. విజేతలకు వేదికపై బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ విజయం పాఠశాలకు, మండలానికి గర్వకారణమని ప్రిన్సిపల్ సుమన్ కుమార్, వైస్ ప్రిన్సిపల్…
పేదింటి బిడ్డకు వైద్య విద్యలో సీటు – ఆదుకున్న మాదిగ యువసేనవెల్దండ, సెప్టెంబర్ 09 :వెల్దండకు చెందిన గుద్దేటి శేఖర్ కుమార్తె గుద్దేటి సరిత నీట్ లో ప్రతిభ చాటి కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది.నిరుపేద విద్యార్థినిని మాదిగ సంఘం నేతలు ఘనంగా సన్మానించారు. పై చదువుల కోసం మాదిగ యువసేన రూ.17,500, శశిపాల్ రెడ్డి ద్వారా పుష్పగిరి రావు రూ.10,000 చొప్పున మొత్తం రూ.27,500 ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో పుల్లయ్య,…
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వద్దు ఎస్సై యుగంధర్ రెడ్డివెల్దండ సెప్టెంబర్ 08: వెల్దండ మండలంలోని బొల్లంపల్లి తో పాటు వివిధ గ్రామాల బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని వెల్దండ ఎస్ఐ యుగేందర్ రెడ్డి తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భక్తులు, ఆలయ కమిటీలు, యువకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, భక్తి గీతాలను మాత్రమే తక్కువ శబ్దంతో వినిపించాలన్నారు.మద్యం సేవించి అల్లర్లు సృష్టిస్తే, శాంతి…