పేద కుటుంబానికి గోలి ఆపన్న హస్తం.. అనిత గృహ నిర్మాణానికి చేయూత
- బైక్ను ఢీకొట్టిన ఆటో.. పంచాయతీ కార్యదర్శికి తీవ్ర గాయాలు - October 23, 2026
- రోడ్డు ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్ నాయకుడికి సర్పంచ్ పరామర్శ - October 23, 2026
- జాతీయస్థాయి తంగ్-తా పోటీలకు కేజీబీవీ విద్యార్థిని.. సింధు - October 23, 2026
వెల్లడం సెప్టెంబర్ 08:వెల్దండ మండల పరిధిలోని రాచుర్ గ్రామానికి చెందిన
తెలగమళ్ళ అనిత రవికుమార్ గృహ నిర్మాణానికి మంగళవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ గోలి శ్రీనివాస్ రెడ్డి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందజేసి ఉదారత చాటుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదల చీకటి జీవితాలలో వెలుగులు నింపేందుకు గృహ నిర్మాణాలకు తన వంతుగా సహకారం అందించడం ఆనందంగా ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపి, మండల పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ విజయ్ గౌడ్,మాజీ వైస్ ఎంపీపి లు గోవర్ధన్,అనిల్ కుమార్,మాజీ ఎంపీటిసి గుత్తి వెంకటయ్య,మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి,నిరంజన్,లింగం,ప్రభాకర్,రాజు,రాజేష్,వెంకటయ్య,అంజి మాస్టార్,ప్రవీణ్, గణేష్,నరేష్, రమేష్, పోలే అశోక్,వెంకటయ్య, గోరేటి దశరథం తదితరులు పాల్గొన్నారు.
