అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తాం.. తహసిల్దార్ కార్తీక్ కుమార్

వెల్దండలో 19,889 స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ – తహసీల్దార్ కార్తీక్ కుమార్

వెల్దండ సెప్టెంబర్ 08: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందజేస్తామని తహసీల్దార్ బీశ్వ కార్తీక్ కుమార్ అన్నారు. మంగళవారం వెల్దండ మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్దండ మండలంలోని 32 గ్రామ పంచాయతీలకు 19,889 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయని, అందులో అదనంగా 12 వేల మంది పేర్లను నమోదు చేశామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని, పరిశీలించి మంజూరు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్,ఉప సర్పంచ్ బస్నమోని శ్రీను ముదిరాజ్, సింగిల్ వినో డైరెక్టర్ వెంకటయ్య గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి మోతిలాల్ నాయక్,కిసాన్ సెల్ అధ్యక్షులు పర్వత్ రెడ్డి,మీర్ ఆలీ, సర్పంచుల సంఘం మండల అధ్యక్షురాలు భాగ్యమ్మ, నాయకులు పుల్లయ్య, రషీద్, భరత్ గౌడ్ శ్రీనివాసులు,వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...